టీడీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కిషోర్‌ చంద్రదేవ్‌

టీడీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కిషోర్‌ చంద్రదేవ్‌

ప్రచారం జరిగినట్టుగానే కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్... తెలుగుదేశం పార్టీలో చేరడం ఫైనల్ అయిపోయింది. ఢిల్లీలో పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ఆయన... ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిషోర్ చంద్రదేవ్... త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కి తెలుగుదేశం పార్టీ మినహా వేరే ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు కిషోర్ చంద్రదేవ్... అయితే, సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో తాను పోటీ చేసే సీటు విషయంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు.