క్లారిటీ ఇచ్చిన అఖిలప్రియ...!

క్లారిటీ ఇచ్చిన అఖిలప్రియ...!

ఏపీలో మంత్రి భూమన అఖిలప్రియ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది... ఆమె గన్‌మెన్లను వెనక్కి పంపడంతో కొత్త చర్చకు తెరతీసినట్లు అయ్యింది. దీంతో అమె తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెబుతారనే ప్రచారం కూడా జోరందుకుంది... దీనిపై స్పందించిన మంత్రి అఖిలప్రియ... పార్టీ మారే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు... కొన్ని పత్రికలు పనిగట్టుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి... ముఖ్యమంత్రి చంద్రబాబు వళ్లే ఆళ్లగడ్డకు నీళ్లు వచ్చాయి... నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆళ్లగడ్డలో మళ్లీ గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని ప్రకటించిన ఆమె... ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని... నా తల్లీతండ్రులు చూపిన బాటలోనే నడిస్తానని తెలిపారు. అయితే, మరోవైపు తాజాగా ఆళ్లగడ్డ నియోజకవరంలోని సిరివెళ్ల గ్రామంలో సీఎం చంద్రబాబు ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు అఖిలప్రియ అనుచరులు... సీఎం ఫోటో ఉన్న ఫ్లెక్సీలు తొలగించి కేవలం మంత్రి ఫోటో ఉన్న ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఇది ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.