రేపు కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ కు శంకుస్థాపన

రేపు కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ కు శంకుస్థాపన

కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్ కు రేపు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. పవిత్ర సంగమం నుంచి కోర్ కాపిటల్ వరకు నిర్మించే ఈ బ్రిడ్జ్ కు రేపు ఉదయం 10 గంటలకు భూమిపూజ నిర్వహించనున్నారు. ఏపీ ప్రభుత్వం రూ.1300 కోట్లతో ప్రతిష్టాత్మకంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతుంది. రాజధాని ప్రాంతానికి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై నుంచి రాకపోకలకు ఈ బ్రిడ్జ్ ఉపయోగపడనుంది. రెండేళ్ల లో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.