కథానాయకుడిని రాజమౌళి డీల్ చేసుంటే..!!

కథానాయకుడిని  రాజమౌళి డీల్ చేసుంటే..!!

కథానాయకుడు ఈరోజు రిలీజ్ అయింది.  ప్రీమియర్ ద్వారా బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించింది.  సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ అంకె రేపటికి పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.  సినిమా చూసిన తరువాత ఎన్టీఆర్ కథను తెరపై పర్ఫెక్ట్ గా చూపించారంటే.. కొందరు మాత్రం సినిమా అతుకుల బొంతలా మారిందని చెప్తున్నారు.  ఒక సీన్స్ కు మరో సీన్ కు లింక్ లేకుండా పరుగులు తీసిందని, బాలకృష్ణ మినహా మిగతా పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదని అంటున్నారు.  

 క్రిష్ మంచి దర్శకుడే.  అది కాదనలేని సత్యం.  కొన్ని సీన్స్ ను  క్రిష్ అద్భుతంగా చిత్రీకరిస్తాడు.రు.  అది కాదనలేం.  ఎన్టీఆర్ జీవిత కథ అందరికి తెలిసిందే.  తెలియని కోణంలో సినిమాను ఏమైనా చూపించారా లేదా అన్నది అందరిముందున్న ప్రశ్న.  

రాజమౌళి విషయానికి వస్తే.. ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు.  ఎలా తీస్తే ప్రేక్షకులు సినిమాలో  ఇన్వాల్వ్ అవుతాడు అన్నది రాజమౌళి ప్రశ్న.  ఎక్కడ ఏ సీన్ ను మిస్ కానివ్వడు. అందుకే రాజమౌళి టాప్ లో ఉన్నాడు.  ఒకవేళ రాజమౌళి ఎన్టీఆర్ కథానాయకుడిని డీల్ చేసుంటే.. సినిమా మరోవిధంగా ఉండేది.