ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య

ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య

ప్రియుడి కోసం భర్తను చంపింది ఓ భార్య. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జరిగింది. 17 ఏళ్ల క్రితం రాంబాబు, ప్రియదర్శిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. అదే సమయంలో శివ సాయి అనే వ్యక్తి ప్రియదర్శిని ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా హద్దులు దాటింది. ప్రేమిస్తున్నాని శివ సాయి చెప్పడంతో.. భర్తను వదిలేసి అతనితో చెన్నై పారిపోయింది.

అనంతరం పోలీసుల సహాయంతో భార్య ప్రియదర్శిని ఇంటికి తెచ్చుకున్నాడు రాంబాబు. కొన్నాళ్లుగా భర్తతో సరిగానే ఉన్న ప్రియదర్శిని ఈ మధ్య మెసెంజర్ ద్వారా ప్రియుడితో మళ్లీ మాట్లాడింది. ఎన్నాళ్ళు ఇంకా విడివిడిగా మాట్లాడుకుంటాం అని ఇద్దరు రాంబాబుని హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం.. కూల్ డ్రింక్ ఓ మత్తుమందు ఇచ్చి రాంబాబుకు ఇచ్చింది. అతను నిద్రలోకి జారుకున్నాక ఇద్దరు కలిసి రాంబాబు మొహంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండాచేసి హత్య చేశారు. పక్కాగా ప్లాన్ చేసినా.. పోస్ట్ మార్టం రిపోర్ట్ తో అసలు నిజం బయటపడింది. దీంతో ప్రియదర్శిని పోలీసులు విచారించగా నిజం ఒప్పుకుంది. ప్రియదర్శిని, శివ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.