ఐదు నియోజకవర్గాల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ!

ఐదు నియోజకవర్గాల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ!

పాకిస్థాన్ జట్టుకు ఏకైక వన్డే ప్రపంచకప్ ను అందించిన మాజీ క్రికెటర్, పాకిస్తాన్‌ తహరీక్ ఏ ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ వచ్చే ఎన్నికల్లో ఏకంగా ఐదు నియోజకవర్గాల నుండి పోటీ చేయనున్నారు. గురువారం కరాచీ నియోజకవర్గంకు ఇమ్రాన్‌ ఖాన్‌ నామినేషన్ దాఖలు చేశారు. పాకిస్థాన్ లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే  అభ్యర్థులకు కరాచీ నియోజకవర్గం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో బిలావల్ భుట్టో, ఆసీఫా భుట్టో, ఆసిఫ్ జర్ధారీతో పాటు లాయర్ జిబ్రాన్ నసీర్ కూడా కరాచీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు.

2013లో తహరీక్ ఏ ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌.. పెషావర్, రావల్పిండి, మిన్వాలి, లాహోర్ స్థానాల నుండి పోటీ చేసాడు. ప్రస్తుతం వీటితో పాటు కరాచీ నియోజకవర్గం నుండి కూడా పోటీ చేస్తున్నాడు. కరాచీ అభివృద్దికి పది పాయింట్ల అజెండాను ఇమ్రాన్‌ ఖాన్‌ ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే.