కియా కారులో చంద్రబాబు...

కియా కారులో చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కియా కారులో ప్రయాణం చేశారు... అమరావతిలోని సచివాలయంలో కాసేపటి క్రితమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కియామోటార్స్ ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన చంద్రబాబు. ఒక సారి బ్యాటరీ ఛార్జి చేస్తే 400 కిలోమీటర్ల దూరం కార్లు తిరిగే అవకాశం ఉంటుంది... ఒకసారి చార్జీంగ్ కి 100 కిలో మీటర్ల దూరం ప్రయాణించే రెండు కియా కార్లను ప్రారంభించారు సీఎం. కియా కారులో సభాస్థలి వరకు ప్రయాణం చేశారు. అత్యంత ఆధునిక నిరో హైబ్రిడ్, నిరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, నిరో ఎలక్ట్రికల్ కార్లను రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా అందించింది కియా మోటార్స్... కారు తాళాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు కియా మోటార్స్ సీఈవో. ఈ సందర్భంగా ‘ఫ్యూచర్ మొబిలిటీ పార్టనర్‌షిప్’పై కియా మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.