పశుమాంస ఎగుమతి సంస్థపై ఐటీ దాడులు

పశుమాంస ఎగుమతి సంస్థపై ఐటీ దాడులు

ఆదాయపన్ను శాఖ ముంబై విభాగం ఈ వారం పశుమాంస ఎగుమతి సంస్థ అల్లానా గ్రూప్ ఆవరణలో దాడులు జరిపింది. రెండు రోజుల పాటు దాదాపు 100కి పైగా యూనిట్లపై దాడులు నిర్వహించారు. అవసరమైతే రాబోయే రోజుల్లో మరిన్ని సోదాలు జరిపే అవకాశమున్నట్టు తెలిసింది. అయితే కంపెనీ వర్గాలు మాత్రం ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదు.

అల్లానా గ్రూప్ దున్నపోతు మాంసాన్ని ఎగుమతి చేస్తుంది. భారత్ నుంచి ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తులు, వ్యవసాయోత్పత్తులను సుమారు 85కి పైగా దేశాలకు ఎగుమతి చేసే పెద్ద సంస్థ అల్లానా గ్రూప్.