ఆసిస్ పై ఇషాంత్ శర్మ అరుదైన రికార్డు

ఆసిస్ పై ఇషాంత్ శర్మ అరుదైన రికార్డు

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. రెండో రోజు ఉదయం ఇషాంత్ వేసిన తొలి ఓవర్ లోనే ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ ని డకౌట్ చేయగా, అనంతరం కెప్టెన్ టిమ్ పైన్ కు కూడా ఔట్ చేశాడు. ఈ రెండు వికెట్లు సాధించడంతో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 50 వికెట్లు పడగొట్టిన తొలి భారత ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ కలిస్.. 28 టెస్టుల్లో 50 ఆసీస్ వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ కేవలం 23 టెస్టుల్లోనే ఆ ఘనత అందుకోవడం విశేషం.