నేడు భారత్, ఆసీస్ మధ్య తొలి వన్డే

నేడు భారత్, ఆసీస్ మధ్య తొలి వన్డే

సిడ్నీ వేదికగా ఈరోజు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. టెస్ట్ సిరీస్ విజయంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్ వన్డేలో కూడా ఆధిపత్యం ప్రదర్శించాలని కనిపిస్తుంది. బాల్ టాంపరింగ్ వివాదంతో మసకబారిన తమ ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్న ఆసీస్ పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలని అనుకుంటున్నది. స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్, సీనియర్ పేసర్ పీటర్ సిడిల్ చేరికతో ఆసీస్ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. మంచి జోరుమీదున్న భారత్ ఏమాత్రం పోటీనిస్తుందో ఆసక్తిగా మారింది. 

భారత్‌ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. అప్పుడు భువనేశ్వర్‌తో పాటు ఖలీల్‌, షమి పేస్‌ బాధ్యతలు పంచుకుంటారు. పాండ్య గైర్హాజరీలో జడేజా ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వస్తాడని కోహ్లి ఇప్పటికే చెప్పాడు. అతడు కుల్‌దీప్‌ యాదవ్‌తో కలిసి స్పిన్‌ విభాగాన్ని చూసుకుంటాడు. బౌలింగ్‌లో అవసరమైతే పార్ట్‌ టైమర్‌ కేదార్‌ జాదవ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక బ్యాటింగ్‌లో మూడో స్థానంలో కోహ్లి భారత్‌కు కొండంత అండ. రాయుడు, జాదవ్‌, ధోనీలతో మిడిల్‌ ఆర్డర్‌ కూడా బాగానే కనిపిస్తోంది.