ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

హామిల్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. స్పిన్నర్ చహల్ స్థానంలో కుల్దీప్ తుది జట్టులోకి వచ్చాడు. కివీస్ జట్టులో టిక్నెర్ జట్టులోకి వచ్చాడు. మూడు టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. ఈ మ్యాచ్ గెలిచి విదేశీ గడ్డపై మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భారత్ చూస్తోంది. మరోవైపు వన్డే సిరీస్‌ను కోల్పోయిన కివీస్.. కనీసం పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌ను అయినా చేజిక్కించుకోవాలని భావిస్తోంది. 

జట్లు:

భారత్: 
రోహిత్ (కెప్టెన్), ధవన్, రిషబ్, శంకర్, ధోనీ, కార్తీక్, హార్దిక్, కృనాల్, భువనేశ్వర్, కుల్దీప్, ఖలీల్.

న్యూజిలాండ్: 
విలియమ్సన్ (కెప్టెన్), సీఫెర్ట్, మున్రో, మిచెల్, టేలర్, గ్రాండ్‌హోమీ, సాంట్నెర్, స్కాట్, సౌతీ, సోధీ, టిక్నెర్.