పోరాడి ఓడిన భారత్..

పోరాడి ఓడిన భారత్..

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో భారత్‌ ఓటమి చెందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 292 పరుగులు చేసింది. 40 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్  కుక్(147), రూట్(125)ల అద్భుత శతకాలతో  423 పరుగులు చేసి భారత్‌కు 464 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. లక్ష్యఛేదనలో తడబడిన భారత్‌.. 94.3 ఓవర్లలో 345 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో 118 పరుగుల తేడాతో విజయం సాధించి 4-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.