బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

భారత్-ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య చారిత్రక ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వన్డేల్లో, టీ-20ల్లో అద్భుత ప్రదర్శన చేసున్న ఆఫ్గానిస్థాన్‌ తొలిసారి ఐదు రోజులు జరిగే ఫార్మాట్‌లోకి  బరిలోకి దిగింది.  టెస్టు ర్యాంకింగ్స్ లో నంబర్‌వన్‌గా ఉన్న భారత్‌ను ఆఫ్గాన్‌ జట్టు ఎలా ఎదుర్కొంటుందన్నదే విషయం. వికెట్ బ్యాటింగుకి అనుకూలంగా ఉండడంతో మొదటగా బ్యాటింగ్  ఎంచుకున్నా.. జట్టు ఆటగాళ్లు అందరూ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, ఈ ఏకైక టెస్టులో విజయం సాధిస్తామని రహానే ధీమా వ్యక్తం చేశాడు. 'తమకు తొలుత బౌలింగ్ చేసే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. జట్టులోని అందరు ఈ తొలి టెస్ట్ విజయం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు' అని ఆఫ్గనిస్థాన్ కెప్టెన్ అస్ఘర్ స్టానిక్ జై తెలిపారు.

జట్లు:

భారత్‌: రహానే(కెప్టెన్‌), విజయ్‌‌, ధవన్‌, పుజారా, లోకేష్ రాహుల్‌, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌, జడేజా, ఇషాంత్‌, ఉమేష్.

అఫ్ఘానిస్థాన్‌: అస్గర్‌ స్టనిక్‌జయ్‌(కెప్టెన్‌), షెజాద్‌, జావెద్‌ అహ్మది, రహ్మత్‌షా, మహ్మద్‌ నబి, అఫ్సర్‌ జజాయ్‌, షాహిది, రషీద్‌ఖాన్‌, ఎమిన్‌ అహ్మద్‌జాయ్‌, ముజీబ్‌ ఉర్  రెహ్మాన్, వఫాడర్.