సిడ్నీ టెస్ట్ డ్రా, సిరీస్ నెగ్గిన భారత్

సిడ్నీ టెస్ట్ డ్రా, సిరీస్ నెగ్గిన భారత్

టీమిండియా చరిత్ర సృష్టించింది. అస్ట్రేలియా గడ్డపై భారత్‌ తొలిసారిగా సిరీస్ సాధించింది. బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టుకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. చివరి రోజు మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో దక్కించుకుంది. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్‌ సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు 7 విజయాలు దక్కాయి. టెస్ట్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు సాధించారు. ఇప్పటి వరకు 11 ఆస్ట్రేలియా పర్యటనలలో 8 పరాజయాలు, 3 డ్రాగా ముగిశాయి. విదేశాల్లో 11 టెస్టు సిరీస్ విజయాలతో గంగూలీ సరసన కోహ్లీ చేరారు.