క్రికెట్‌ చరిత్రలో ఆసీస్‌ రికార్డు

క్రికెట్‌ చరిత్రలో ఆసీస్‌ రికార్డు

క్రికెట్‌ చరిత్రలో ఆస్ట్రేలియా అరుదైన రికార్డును అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 1000వ విజయాన్ని నమోదు చేసి క్రికెట్‌ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. సిడ్నీ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ గెలవడంతో.. అంతర్జాతీయ క్రికెట్‌లో 1000వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో 1000 విజయాల్ని అందుకున్న తొలి జట్టుగా ఆసీస్‌ నిలిచింది. ఆసీస్ టెస్టులలో 384 విజయాలు, వన్డేలలో 558 విజయాలు, టీ-20లలో 58 విజయాలు నమోదు చేసింది.

1877లో మెల్‌బోర్న్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ తన తొలి విజయాన్ని అందుకుంది. 1951లో వెస్టిండీస్‌పై 100వ విజయాన్ని నమోదు చేసింది. 1999లో పాకిస్తాన్‌పై 500వ విజయాన్ని సాధించింది. ఈ జాబితాలో 774 విజయాలతో ఇంగ్లండ్‌ రెండో స్థానంలో ఉంది. 711 విజయాలతో భారత్‌ మూడో స్థానంలో ఉంది.