వన్డేలలో 10,000 మైలురాయి చేరిన ధోనీ

వన్డేలలో 10,000 మైలురాయి చేరిన ధోనీ

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 10,000 పరుగులు మైలురాయిని చేరుకున్నాడు. దీంతో వన్డేల్లో 10,000 పరుగులు చేసిన ఐదో బ్యాట్స్ మెన్ గా ధోనీ రికార్డుల కెక్కాడు. ఆరో ఓవర్ చివరి బంతిని ఫ్లిక్ చేసి పరుగు చేయడంతో ధోనీ ఈ మైలురాయి చేరాడు. ఈ ఫీట్ సాధించేందుకు ధోనీకి 282 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. 10 శతకాలు, 67 ఫిఫ్టీలతో 50కి పైగా సగటు సాధించాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ మాత్రమే వన్డేలలో 10,000 పరుగులు చేశారు.