లార్డ్స్‌ టెస్ట్‌: బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్

లార్డ్స్‌ టెస్ట్‌:  బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్

లార్డ్స్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ ఎట్టకేలకు ప్రారంభమైంది.  ఈ మ్యాచ్‌ నిన్న ప్రారంభం కావాల్సి ఉండగా.. తొలి రోజు ఆట టాస్ కూడా పడకుండానే వర్షార్పణమైంది. ఇవాళ టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. శిఖర్‌ ధావన్‌, ఉమేశ్‌ యాదవ్‌‌ల స్థానంలో పుజారా, కుల్దీప్ యాదవ్‌లకు తుది జట్టులో చోటు కల్పించింది. లార్డ్స్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న నేపథ్యంలో రెండో స్పిన్నర్ వైపే భారత్ మొగ్గుచూపింది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. జేమ్స్ అండర్సన్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి మురళీ విజయ్ డకౌట్ అయ్యాడు.