సిరీస్ చేజార్చుకున్న భారత మహిళల జట్టు

సిరీస్ చేజార్చుకున్న భారత మహిళల జట్టు

న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో భార‌త మ‌హిళ‌లు చివ‌రి వ‌ర‌కు పోరాడి ప‌రాజ‌యం పాల‌య్యారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో పరాజయంతో సిరీస్‌ను చేజార్చుకుంది. శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య కివీస్‌ జట్టు భారత్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ భార‌త్‌కు బ్యాటింగ్ అప్పగించింది. 20 ఓవ‌ర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్స్‌లో జెమీమా రోడ్రిగ్స్ 72 పరుగులు.. స్మృతి మందాన 36 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. న్యూజిలాండ్ ముందు భార‌త్ స్వల్ప ల‌క్ష్యం మాత్రమే ఉంచ‌గ‌లిగింది.

అనంత‌రం 136 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్‌ను భార‌త బౌల‌ర్లు అద్భుత బౌలింగ్‌తో క‌ట్టడి చేయ‌గ‌లిగారు. అయితే సుజీ బేట్స్ 62 పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని అందించింది. భార‌త బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో న్యూజిలాండ్‌కు ప‌రుగులు ల‌భించ‌డం క‌ష్టమైంది. ఆఖ‌రి ఓవ‌ర్లో కివీస్ విజ‌యానికి తొమ్మిది ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. తొలి బంతిని కేటీ మార్టిన్ ఫోర్ కొట్టడంతో న్యూజిలాండ్‌ విజ‌యం సాధించింది.