వెల్లింగ్టన్‌ టీ20: భారత్‌కు భారీ టార్గెట్‌

వెల్లింగ్టన్‌ టీ20: భారత్‌కు భారీ టార్గెట్‌

వెల్లింగ్టన్‌ టీ20లో న్యూజిలాండ్‌ చెలరేగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి భారత్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.  ఓపెనర్‌ టిమ్‌ సీఫెర్ట్‌ (84; 43 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. సొగసైన బౌండరీలు, భారీ సిక్సర్లతో  విరుచుకుపడ్డాడు. మరో ఓపెనర్‌ మున్రో (34; 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ విలియమ్సన్‌ (34; 22 బంతుల్లో 3 సిక్సర్లు)తో ఆకట్టుకున్నారు. చివర్లో కగిలిజీన్ (20; 7 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌) మెరిపించడంతో కివీస్‌ భారీ స్కోరు నమోదు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్‌ 2, ఖలీల్‌, కృనాల్, భువనేశ్వర్‌, చాహల్‌ చెరో వికెట్‌ తీశారు.