ముగ్గురు కీపర్లతో టీమిండియా బరిలోకి..?

ముగ్గురు కీపర్లతో టీమిండియా బరిలోకి..?

న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్‌లో ఇవాళ తలపడబోతున్న టీమిండియా.. జట్టు కూర్పుపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. వన్డే ప్రపంచకప్‌ సమీపిస్తుండడంతో తాము చివరిసారిగా పరీక్షించదలచుకున్న ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో అవకాశం ఇవ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఓపెనర్లుగా సీనియర్లు రోహిత్‌శర్మ, శిఖర్‌ ధవన్‌లు ఖాయంకాగా.. మూడో స్థానంలో శుభమన్‌ గిల్‌కు చోటు కల్పించవచ్చు. 4, 5, 6 స్థానాల్లో ధోనీ, పంత్‌, కార్తీక్‌లు వచ్చే ఛాన్స్‌ ఉంది. అంటే.. ఫైనల్‌ లెవన్‌లో ముగ్గురు స్పెషలిస్ట్‌ వికెట్‌ కీపర్లూ ఉండే అవకాశం ఉంది. 

పంత్‌ను బ్యాట్స్‌మన్‌గా అయినా ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలన్న డిమాండ్లు పెరిగాయి. సెలక్టర్లు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. దినేశ్‌ కార్తీక్‌ కూడా ప్రపంచకప్‌ ప్రణాళికల్లో ఉండటంతో అతడిని కూడా ఆడించనున్నారు. మొత్తానికి ముగ్గురు వికెట్‌ కీపర్లు తుది జట్టులో ఉంటే అది అరుదైన విషయమే. అన్నదమ్ములు కృనాల్‌ పాండ్యా, హార్దిక్‌ పాండ్యా ఆల్‌ రౌండర్ల కోటాను భర్తీ చేయనున్నారు. చహల్‌ రూపంలో ఒక్క స్పిన్నర్‌ సరిపోతాడనుకుంటే కృనాల్‌ స్థానంలో కేదార్‌ జాదవ్‌కు ఛాన్స్‌ రావొచ్చు. చాహల్‌ లేదా కుల్దీప్‌లలో ఒకరికి అవకాశం దక్కొచ్చు.

ఫైనల్‌ 11 ప్రాబబుల్స్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, ధోని (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌, కేదార్‌ జాదవ్‌/కృనాల్‌, భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌, చాహల్‌/కుల్‌దీప్‌