నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు...

నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు...

తెలంగాణ ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభంకానున్నాయి. మే 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,20,549 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 1,25,960 మంది విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాస్తుండగా.. 1,42,793 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలను ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలను మధ్యాహ్నం  2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు. 15 నిమిషాల ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని.. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.