ఆసక్తిని పెంచుతున్న ఎన్టీఆర్ ఓవర్సీస్ హక్కులు

ఆసక్తిని పెంచుతున్న ఎన్టీఆర్ ఓవర్సీస్ హక్కులు

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు సంబంధించిన ఓ స్టిల్ వినాయక చవితి రోజున రిలీజ్ చేశారు. ఈ స్టిల్ ఆద్యంతం ఆసక్తిని పెంచే విధంగా ఉన్నది.  ఎన్టీఆర్ తో ఆనాటి చంద్రబాబు నాయుడు ఫోటో కు సంబంధించిన సీన్ షూట్ చేస్తున్నారు.  ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ ట్రెండ్ అవుతున్నది.  

బాలకృష్ణకు  ఓవర్సీస్ లో మార్కెట్ పెద్దగా లేదు.  రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరేందుకు బాలయ్య చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.  ఎలాంటి పెద్ద స్టార్స్ లేకుండానే మహానటి సినిమా రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసినప్పుడు.. భారీ స్థాయిలో స్టార్స్ ఉన్న ఈ సినిమా తప్పకుండా ఆ రికార్డ్ ను సొంతం చేసుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.  తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా  ఓవర్సీస్ రైట్స్ ను ఓ ప్రముఖ సంస్థ రూ.కోట్లకు సొంతం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.  మార్కెట్ ఎక్కువగా ఉన్న నటులకు ఈ మొత్తంలో హక్కులు ఉంటాయి.  ఇప్పుడు బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ఈ స్థాయిలో అమ్ముడు పోవడం విశేషమనే చెప్పాలి.