మరికొన్ని గంటల్లో ఐఫోన్‌ 9...

మరికొన్ని గంటల్లో ఐఫోన్‌ 9...

ఎన్ని మోడల్ ఫోన్స్ మార్కెట్‌లోకి వచ్చినా... కొత్త ఫోన్లు వస్తున్నాయంటే చాలు అదో ఆసక్తి... ఇక ఎంతోమందిని ఫిదా చేసిన యాపిల్ నుంచి కొత్త మోడల్ ఫోన్స్ వస్తున్నాయంటే అది ఎప్పుడు చేజిక్కించుకోవాలి... ఎప్పుడు వాడాలి... ఎప్పుడు తమకు ఇష్టమైన వారికి అందజేయాలనే కుతూహలం ఉంటుంది... అలాంటి వారికి గుడ్ న్యూస్ చెబుతూ... యాపిల్ ఈవెంట్‌కు సర్వం సిద్ధమైంది. అయితే యాపిల్ మూడు కొత్త ఐఫోన్లు లాంచ్‌ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఐఫోన్ ఎక్స్‌సీ (ఐఫోన్), ఐఫోన్ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్ ఎక్స్‌ఎస్‌ మ్యాక్స్‌ను ఈ రోజు రాత్రి 10.30 గంటలకు జరగనున్న ఈవెంట్ రిలీజ్ చేయనుందనే ప్రచారం సాగుతోంది. 

వీటిలో 5.8 అంగుళాల ఓలెడ్ స్క్రీన్‌తో ఐఫోన్ ఎక్స్‌సీ మోడల్, 6.5 అంగుళాల ఓలెడ్ స్క్రీన్‌తో ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్, 6.1 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ఐఫోన్ ఎక్స్ఎస్ ఫోన్లు కావచ్చన్న ప్రచారం ఉండగా... ఈసారి ఫోన్ల ధరలు ఎక్కువగా ఉంటాయనే విశ్లేషలున్నాయి... ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్ ధర సుమారు రూ.75,000, ఐఫోన్ ఎక్స్ఎస్ ధర సుమారు 71,000, ఐఫోన్ ఎక్స్‌సీ ధర రూ.57,000గా ఉండొచ్చు అంటున్నారు విశ్లేషకులు... మరోవైపు ఐఫోన్లతో పాటు యాపిల్ ఐప్యాడ్ ప్రో మోడల్స్‌ని కూడా లాంఛ్ చేయనుంది. ఈ ఈవెంట్‌లో సరికొత్త మ్యాక్ లైనప్‌ కూడా లాంఛ్ కానుందని ప్రచారం జరుగుతోంది. మ్యాక్ బుక్, మ్యాక్ బుక్ ప్రో, ఐమ్యాక్‌తో పాటు మ్యాక్ మినీ కూడా ఉండొచ్చు. డిస్‌ప్లే పెర్ఫామెన్స్‌లో అప్‌గ్రేడ్స్ చాలా ఉంటాయని టెక్ నిపుణులు అంచనా.