ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు...

ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు...

హైదరాబాద్ నగరంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయింది. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో ఐదుగురు తప్పించుకున్నారు. నిందితుల వద్ద రూ.15 లక్షల  50 వేల నగదు, 22 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. డిజిటల్ నెట్ వర్క్ ద్వారా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ముంబై, గోవా, బెంగళూరు కేంద్రంగా ఈ దందా జరుగుతుంది అని సమాచారం. నిందుతులు వేర్వేరు వృత్తుల్లో ఉంటూ.. ఈజీ మనీ కోసమే బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని సీపీ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితిలో సహించబోమని అన్నారు. యువత క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.