ఐపీఎల్ ప్లేఆఫ్స్, ఫైనల్ టైమ్ మార్చేశారు

ఐపీఎల్ ప్లేఆఫ్స్, ఫైనల్ టైమ్ మార్చేశారు

ఐపీఎల్ మ్యాచ్‌లతో క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటికే రచ్చరంబోల చేస్తున్నారు... కుదిరితే స్టేడియానికి వెళ్లడం... లేకపోతే ఫ్రెండ్స్‌తో కలిసి స్క్రీన్లు ఏర్పాటు చేసి, లేదా టీవీల ముందు కూర్చొని మ్యాచ్‌లు చూస్తు హంగామా చేస్తున్నారు. అయితే రాత్రి 8 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం అవుతుండడంతో కొన్ని ఇబ్బందులు తప్పడంలేదు... అర్ధరాత్రి వరకు మ్యాచ్‌లు నడుస్తుండడంతో క్రికెట్ ఫ్యాన్స్‌కు నిద్ర లేకుండా పోతోంది. దీంతో ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల టైమ్ మార్చేస్తున్నట్టు ప్రకటించారు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా.

మారిన ఐపీఎల్ ప్లేఆఫ్స్, ఫైనల్ సమయం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకే ప్రారంభమవుతాయని వెల్లడించారు రాజీవ్ శుక్లా. మ్యాచ్‌ అనంతరం స్టేడియాల నుంచి ఇళ్లకు వెళ్లే క్రికెట్‌ ఫ్యాన్స్ ఇబ్బందులు, టీవీల్లో చూసేవాళ్లు కూడా పనులకు వెళ్లడం కష్టమవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక ఈ సీజన్‌లో రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఈనెల 23, 25 తేదీల్లో  కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుండగా... మే 27వ తేదీన ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఫైనల్ మ్యచ్ జరగనుంది. సమయం మార్చడంతో మరో గంట ముందే మ్యాచ్ ముగియనుంది. ఐపీఎల్‌ మ్యాచ్ అంటేనే క్రేజ్... ఇక ప్లేఆఫ్స్, ఫైనల్ అంటే అందరి దృష్టి అటే... తాజా నిర్ణయంపై క్రికెట్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.