ఓటర్ జాబితాలో ఐపీఎస్ కృష్ణప్రసాద్ పేరు గల్లంతు

ఓటర్ జాబితాలో ఐపీఎస్ కృష్ణప్రసాద్ పేరు గల్లంతు

తెలంగాణ ఓటరు జాబితాలో తన పేరు లేకపోవడంపై రోడ్డు భద్రత సాధికార సంస్థ చైర్మన్, డీజీపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓటరు గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ తన పేరు జాబితాలో లేదని అధికారులు తనను ఓటేయకుండా అడ్డుకున్నారని ఆయన ట్విటర్‌ ఖాతాలో తన ఓటర్ ఐడీతో సహా పోస్ట్ చేశారు. తన ఓటేసే హక్కుని నిరాకరించడం వల్ల ఎంతో నిరాశగా ఇంటికి చేరుకున్నట్టు తెలిపారు. ఇదంతా ఎన్నికల సంఘం నిర్వాకమేనంటూ థ్యాంక్స్ టు ఎలక్షన్ కమిషన్ అని ట్వీట్ చేశారు.