ఆర్టీసీ కార్మికులకు ఐఆర్‌.. ఎంతంటే..

ఆర్టీసీ కార్మికులకు ఐఆర్‌.. ఎంతంటే..

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు 16 శాతం మధ్యంతర భృతి(ఐఆర్‌)ని ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ కార్మిక సంఘాలతో చర్చలు జరిపిన అనంతరం మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, హరీష్‌రావు, మహేందర్‌రెడ్డి ఈమేరకు ప్రకటించారు. కార్మికులు 25 శాతం మధ్యంతర భృతి అడిగినప్పటికీ 16 శాతం పెంచగలిగామని చెప్పారు. ఐఆర్‌ పెంపుదల వల్ల సంస్థకు నెలకు రూ.16 కోట్ల భారం పడుతుందని తెలిపారు.  ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ కార్మికుల కోరిక మేరకు మధ్యంతర భృతిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెంచారని మంత్రులు చెప్పారు. ఆర్టీసీ బాగుపడితే రాష్ట్ర ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందని సీఎం భావించారని వివరించారు. పెంచిన ఐఆర్‌ను జూలై నుంచి కార్మికులకు అందజేస్తాం ప్రకటించారు. మధ్యంతర భృతి పెంపు నేపథ్యంలో.. సమ్మె నోటీసులను కార్మిక సంఘాలు వెనక్కితీసుకున్నాయి.