బన్నీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?

బన్నీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?

అల్లు అర్జున్ కొత్త సినిమా సంగతి ఏమోగానీ, ఆడియో వేడుకలకు, సక్సెస్ మీట్ లకు మాత్రం అల్లు అర్జున్ హాజరవుతూ బిజీగా మారిపోయాడు.  ఇటీవలే వచ్చిన విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమా ఆడియో వేడుకకు అల్లు అర్జున్ హాజరయ్యారు.  ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  విజయ్ నెక్స్ట్ నోటా సినిమా చేశాడు.  ఆశించిన విజయం సాధించలేదు.  

ఈనెల 17 వ తేదీన టాక్సీవాలా రిలీజ్ కాబోతున్నది.  గీతగోవిందం సినిమా కంటే ముందే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నది.  కొన్ని కారణాల వలన సినిమా వాయిదా పడింది.  ఈలోపుగా ఈ సినిమా నెట్ లో లీక్ కావడంతో.. ఆ సమస్యను సాల్వ్ చేసుకొనే సరికి ఈ సమయం అయింది.  యువీక్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థకు చెందిన జీఏ2 బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి.  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నవంబర్ 11 న గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

ఈ ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ ముఖ్య అతిధిగా వస్తున్నాడట.  గీత గోవిందం సెంటిమెంట్ తో బన్నీని ఈ సినిమాకు కూడా ముఖ్య అతిధిగా  ఆహ్వానించినట్టుగా తెలుస్తున్నది.  మరి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ఏమో చూద్దాం.