అత్తారింటికి దారేదిలానే.. గీతగోవిందం కూడా..!!

అత్తారింటికి దారేదిలానే.. గీతగోవిందం కూడా..!!

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక టాలీవుడ్ లో లీకుల సమస్యలు అధికం అయ్యాయి.  గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది 45 నిమిషాల సినిమా సోషల్ మీడియాలో లీక్ కావడంతో టాలీవుడ్ షాక్ తిన్నది.  సినిమా బాగుండటంతో.. విడుదల తరువాత భారీ వసూళ్లు రాబట్టింది.  అప్పట్లో ఆ సినిమా సృష్టించిన సునామి అంతా ఇంతా కాదు.  

ఇప్పుడు గీత గోవిందం విషయంలో కూడా ఇదే జరిగింది.  సినిమాకు ముందు కొన్ని కీలకమైన సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.  ఇలా లీక్ కావడంతో షాక్ తిన్న యూనిట్ దిద్దుబాటు చర్యలు తీసుకుంది.  లీకేజీకి కారణమైన వ్యక్తిని పట్టుకుంది.  లీకైన కీలకమైన సీన్స్ బాగుండటంతో సినిమాకు హైప్ వచ్చింది.  విజయ్ దేవరకొండ డీసెంట్ యాక్టింగ్, రష్మిక సూపర్బ్ పెర్ఫార్మన్స్ తో సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది.  కంటెంట్ ఉంటె లీకులైన బెదడలేదని మరోసారి నిరూపితమైంది.