గ్యాంగ్ లీడర్ కు సీక్వెల్ వస్తుందా..?

గ్యాంగ్ లీడర్ కు సీక్వెల్ వస్తుందా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1991 లో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా సూపర్ ఎలాంటి హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు.  అప్పట్లో మెగాస్టార్ కు బూమ్ ఇచ్చిన సినిమా ఇది.  ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి.  ఇన్నేళ్ల తరువాత గ్యాంగ్ లీడర్ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్టు తెలుస్తోంది.  ఇటీవలే రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సమయంలో గ్యాంగ్ లీడర్ ప్రస్తావన వచ్చింది.  రీసెంట్ గా మరలా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మరోసారి గ్యాంగ్ లీడర్ గురించి మాట్లాడారు.  

గ్యాంగ్ లీడర్ లాంటి చేయాలని ఉందని, స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నానని, మంచి స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా చేస్తానని చెప్పారు చరణ్.  వినయ విధేయ రామ జనవరి 11 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్.