శైలజా రెడ్డి అల్లుడుకి ఏమైంది..?

 శైలజా రెడ్డి అల్లుడుకి ఏమైంది..?

శైలజా రెడ్డి అల్లుడు ఈనెల 31 న విడుదల కాబోతున్న  సంగతి తెలిసిందే.  నిర్మాణాంతర కార్యక్రమాలు శెరవేగంగా జరుగుతున్నాయి.  ఈ ఆదివారం రోజున శైలజా రెడ్డి ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉన్నది.  కొన్ని అనుకోని కారణాల వలన ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టుగా సమాచారం.  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది.  ఆడియోను డైరెక్ట్ గా నెట్ ద్వారా విడుదల చేసి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను  గ్రాండ్ గా నిర్వహించాలని యూనిట్ అనుకుంటున్నదట.  తక్కువ సమయంలో రెండు సార్లు ఫంక్షన్స్ ఎందుకులే అనుకున్నారేమో.. ఈ నిర్ణయం తీసుకున్నారు.  

మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే ఆకట్టుకున్నది.  అనుబేబీ సాంగ్ వినసొంపుగా ఉండటంతో.. సినిమాపై అంచనాలు పెరిగాయి.  రమ్యకృష్ణ శైలజా రెడ్డి పాత్రలో కనిపిస్తున్నది.  నాగ చైతన్యను పూర్తిస్థాయి స్టైలిష్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు మారుతి.  మరి మారుతి ఏ మేరకు సక్సెస్ అవుతాడో తెలియాలంటే ఆగష్టు 31 వరకు ఆగాల్సిందే.