జైట్లీకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వండి

జైట్లీకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వండి

చంద్రబాబుకు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై ఎమ్మల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యకు సహకరించిన ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీకి కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని కేంద్రానికి సూచించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరులోనే పెద్ద కన్నం ఉందని వ్యాఖ్యానించారు. అప్పట్లోనే కన్నా.. రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచేశారని జలీల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహా కూటమి అంటే ప్రధాని మోదీకి భయమేస్తోందని అందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే పలువురు వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే  జలీల్ ఖాన్ తెలిపారు.