జగన్‌పై దాడి కేసు నిందితుడి విచారణ ఎక్కడంటే..

జగన్‌పై దాడి కేసు నిందితుడి విచారణ ఎక్కడంటే..

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును విశాఖపట్నం శివార్లలోని బక్కన్నపాలెం సీఆర్పీఎఫ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించారు. ఈమేరకు తనకు ఎన్‌ఐఏ అధికారులు సమాచారం అందించారని శ్రీనివాసరావు తరఫు న్యాయవాది అబ్దుల్‌ సలీమ్‌ మీడియాకు చెప్పారు. తాను కూడా  బక్కన్నపాలెం సీఆర్పీఎఫ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు వెళ్తున్నానని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీమ్  సమక్షంలో పోలీసులు శ్రీనివాసరావును విచారించనున్నారు.