ఆంజనేయుడికి జగన్‌ పూజలు..

ఆంజనేయుడికి జగన్‌ పూజలు..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెట్ల మార్గంలో తిరుమలకు బయల్దేరారు... నిన్న ప్రజాసంకల్ప యాత్ర ముగించిన జగన్... విజయనగరం నుంచి రైలులో రేణిగుంటకు చేరుకోగా... అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుపతి చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం మధ్యాహ్నం అలిపిరి నుంచి నడకదారిలో తిరుమలకు బయల్దేరారు వైసీపీ అధినేత. కాసేపటి క్రితం మార్గమధ్యలో ఆంజనేయస్వామిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టారు. ఇక.. ఇవాళ వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకోనున్నారు. రాత్రికి తిరుమలలో బస చేసి రేపు ఉదయం ఇడుపులపాయకు వెళ్లనున్నారు.