శ్రీవారి సేవలో జగన్‌

శ్రీవారి సేవలో జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కాసేపటి క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సామాన్య భక్తుడిలా టికెట్‌ తీసుకుని.. క్యూలైన్‌లో వెళ్లి ఆయన శ్రీవారి దర్శించుకున్నారు. మరికాసేపట్లో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసి జగన్‌ ఆశీస్సులు తీసుకుంటారు. ఇవాళ రాత్రి తిరుమలలోనే బస చేసి రేపు ఇడుపులపాయ వెళ్లనున్నారు.