బయోపిక్‌ బాగా తీశారు: జగన్‌

బయోపిక్‌ బాగా తీశారు: జగన్‌

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర'. మలయాళ నటుడు మమ్ముట్టి.. రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో నటించిన ఈ సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌.. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 'మహానేత రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని సినిమాగా తెరకెక్కించడంలో మీరు చూపించిన అభిరుచి, అకింతభావానికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు' అని ట్వీట్‌ చేశారు.