కోడి కత్తి కేసులో ఏం జరుగుతుందో..?

కోడి కత్తి కేసులో ఏం జరుగుతుందో..?

విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి జరిగిన కేసు బెజవాడ కోర్టుకు చేరింది... జగన్‌పై దాడి కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించడంతో కేసు రికార్డులను ఎన్‌ఐఏ కోర్టుకు అప్పగించాలని అధికారులు కోరారు... దీంతో ఇకపై జగన్ పై జరిగిన దాడి కేసు విచారణ బెజవాడ ఎన్‌ఐఏ కోర్టులో జరగనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావును విశాఖ నుంచి బెజవాడకు తలించారు ఎన్‌ఐఏ అధికారులు... నిందితుడిని ఇవాళ 3వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చనున్నారు. మరోవైపు జగన్ కేసుకు ఎన్ఐఏకు అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసుకున్న ఏపీ ప్రభుత్వం... నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏకు అప్పగించాలని, విజయవాడ కోర్టులో‌హాజరు పరచాలన్న ఎంఎస్‌జే కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది.