'మోడీకి వీఆర్‌ఎస్‌ వస్తేనే ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌'

'మోడీకి వీఆర్‌ఎస్‌ వస్తేనే ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌'

ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే.. కుదరదు పదేళ్లు ఇవ్వాలని  వెంకయ్య నాయుడు పట్టుబట్టారని.. ఇప్పుడు మోడీ ఆ మాటే మరిచారని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ అన్నారు. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేస్తున్న చంద్రబాబునాయుడుకు జైరాం రమేష్‌ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయంగా చాలా కాలంగా తమ శత్రువైనప్పటికీ.. ఇప్పుడు ఇద్దరికీ ఉమ్మడి శత్రువు మోడీయేనన్నారు. మోడీ త్వరలోనే వీఆర్ఎస్ తీసుకోవడం ఖాయమని.. మోడీ వీఆర్ఎస్ తీసుకోగానే తాము ప్రత్యేక హోదాపై సంతకం చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం, రాజధానికి నిర్మాణాలకు ఆర్థిక సాయంపై నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది చంద్రబాబేనన్న జైరాం రమేష్‌.. ప్రస్తుతం హైదరాబాద్‌ను పాలిస్తోంది ఎనిమిదో నిజాం అని విమర్శించారు. ఎనిమిదో నిజాం వల్ల హైదరాబాద్‌కు ఒరిగేదేం లేదన్నారాయన.