క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో రాజీనామా...

క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో రాజీనామా...

క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్‌లాండ్ ఊహించని విధంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ఆయన ప్రకటించారు. ఇదే విషయాన్ని సీఏ బోర్డు, చైర్మన్‌కు సదర్‌లాండ్ తెలిపారు. ఈ రోజు విలేకరుల సమావేశంలో సదర్‌లాండ్ మాట్లాడుతూ... 20 ఏళ్లుగా క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)కు సేవలందిస్తున్నాను.. నేను సంతృప్తి కరంగానే ఉన్నాను.. గుడ్‌బై చెప్పటానికి ఇదే సరైన సమయం. ఈ నిర్ణయం క్రికెట్‌ ఆస్ట్రేలియాకు మేలుచేస్తుందని  భావిస్తున్నా అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్‌ సెర్చ్‌ ఎజెన్సీ ద్వారా నూతన సీఈవో నియామకం చేపట్టనున్నట్లు సీఏ ప్రకటించింది. అయితే సుథర్ లాండ్ కు 12 నెలల నోటీస్ పీరియ‌డ్‌ ఇచ్చారు. కొత్తవారిని నియమించే వరకు ఆ పదవిలో సదర్‌లాండ్ సీఈవోగా కొనసాగనున్నారు. 1998లోక్రికెట్ ఆస్ట్రేలియాలో సభ్యుడిగా చేరి.. అనంతరం తన ప్రతిభతో 2001 నుంచి సీఈవోగా కొనసాగుతున్నారు. 

Photo: FileShot