అవకాశం ఇస్తే అభివృద్ధి ఎంటో చూపిస్తా...

అవకాశం ఇస్తే అభివృద్ధి ఎంటో చూపిస్తా...

ఒక్కసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే.. జమ్మలమడుగును అభివృద్ధి చేసి చూపిస్తా అని వైసీపీ సమన్వయకర్త సుధీర్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన కడప ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైఎస్సార్ బిక్షతోనే మంత్రి ఆదినారాయణ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారన్నారు. సొంత తన అన్ననే వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేగా ఆది గెలిచారు. ఆది, రామసుబ్బారెడ్డి మధ్య దశాబ్దాలుగా ఫ్యాక్షన్ వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికీ వారి వల్ల వందలాది మంది జిల్లాలోనే మగ్గుతున్నారన్నారు. జమ్మలమడుగు ప్రజలు ప్రస్తుతం ఫ్యాక్షన్ కోరుకోవడం లేదు. ఇద్దరినీ కాదని వైసీపీకి పట్టం కట్టాలని జమ్మలమడుగు ప్రజలు సిద్ధమయ్యారని సుధీర్ రెడ్డి అన్నారు.

ఒక సాధారణ వైద్యుడు అయిన నన్ను వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. జగనన్న ఆశీర్వాదంతో ఖచ్చితంగా విజయం సాధిస్తా. ఒక్కసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే.. జమ్మలమడుగును అభివృద్ధి చేసి చూపిస్తా అని సుధీర్ రెడ్డి సవాల్ చేశారు.