చింతమనేని బాధితులకు అండగా ఉంటా

చింతమనేని బాధితులకు అండగా ఉంటా

పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాధితులకు తాను అండగా ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆయన... చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయన దళితులను వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. టీడీపీ పాలనలో అంచనాలకు మించి అవినీతి జరిగిందని వెల్లడించారు. త్వరలోనే పార్టీ పార్లమెంట్ స్థాయి కమిటీలు వేస్తానని తెలిపారు. పార్టీలోకి ఎవరైన వస్తే... ఆహ్వానిస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ ఆస్తులను చింతమనేని కబ్జా చేసారని పెదవేగి మండలం గుమ్మడి కుంటకు చెందిన ఇద్దరు మహిళలు పవన్ కు మొరపెట్టుకున్నారు.