అప్పుడే భయపడలేదు: పవన్

అప్పుడే భయపడలేదు: పవన్

'అన్నవరం' సినిమా సమయంలో వైఎస్ మనషులు వారితో సినిమా చేయాలని బెదిరించారు. అప్పుడే ఎవరికీ భయపడలేదు.. ఇప్పుడేందుకు భయపడుతా అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు అనంతపురం గుంతకల్లులో మూతపడ్డ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు పాత కార్మికుల కుటుంబాలను పవన్ కల్యాణ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైకాపా అధినేత జగన్ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే.. అందరి బండారం బయట పెట్టాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. అవినీతితో నిండిపోయిన రాజకీయాలు ప్రక్షాళన కావాలన్నారు.

స్పిన్నింగ్ మిల్లును తిరిగి ప్రారంభించాలని పవన్ డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ రాయలసీమ బిడ్డలైతే.. స్పిన్నింగ్ మిల్లు తెరవాలన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించకుండా.. రూ.1,000,  2,000 ల భృతి ఇవ్వడం కాదు వారికి సరైన న్యాయం చేయాలన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత జనసేన తీసుకుంటుందని పవన్ హామీ ఇచ్చారు.