అనంత 'కరువు' ఎంతగానో బాధించింది..

అనంత 'కరువు' ఎంతగానో బాధించింది..

ఈ నెల 2వ తేదీన జనసేన నిరసన కవాతుతో ప్రారంభమైన జనసేన పోరాట యాత్ర అనంతపురం జిల్లాలోని కరువు పరిస్థితు, నిరుద్యోగ సమస్యలపై, వలసలపై క్షేత్ర స్థాయిలో పర్యటించామన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్... అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన... మా పర్యటనలో ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు, వారి జీవన పరిస్థితులు మమ్మల్ని ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా పర్యటనల్లో ప్రతీ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యలను, వాటి మూల కారణాలను అన్వేషించి వాటిపై డాక్యుమెంటరీ చేసి ప్రజలకు తెలిసేలా వివరిస్తున్నామన్న పవన్... అనంతపురం కరువు, నిరుద్యోగ, వలసల సమస్యలపై జనసేన తీసిన డాక్యుమెంటరీ అక్కడి పరిస్థితిని కళ్లకు కడుతుందన్నారు.