జనసేన కొత్త ప్రచార కార్యక్రమం ఇదే..

జనసేన కొత్త ప్రచార కార్యక్రమం ఇదే..

ఎన్నికల దగ్గర పడుతుండడంతో ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకు జనసేన ప్రాణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే 'జాగోరే..జాగో' పేరతో కొత్త కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తోంది. ఈ ప్రచార కార్యక్రమాన్ని పెదరావూరులో ఇవాళ జనసేనాని పవన్‌కల్యాణ్‌ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్‌ ద్వారా తెలిపారు. ప్రజలతో మాట్లాడటం.. వారి మనసు తెలుసుకోవటం.. వారికి జనసేన సిద్ధాంతాలు, ఆశయాలు తెలియచేయడం.. ఇదీ 'జాగోరే.. జాగో' లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగానే జనసేన కళాబృందాలు తమ విధానాలను పాటలు, పద్యాల రూపంలో చెప్పనున్నాయి.