ఇవాళ జనసేన కవాతు..

ఇవాళ జనసేన కవాతు..

రాయలసీమలో కరువును నివారించడంలో ప్రభుత్వ వైఫలమైందని ఆరోపిస్తూ ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అనంతపురంలో కవాతు నిర్వహిస్తున్నారు. గుత్తి రోడ్డులోని మార్కెట్ యార్డు వద్ద నుంచి క్లాక్ టవర్ వరకు ఈ కవాతు కొనసాగనునుంది. సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2.7 కిలో మీటర్ల మేర కవాతు కొనసాగాక క్లాక్‌టవర్‌ సెంటర్‌ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రసంగిస్తారు. అంతరించిపోతున్న చేనేత కళకు ఆదరణ కల్పించడం, ఉపాధి లేక రోడ్డున పడుతున్న యువతకు అండగా నిలవడం లక్ష్యంగా జనసేన ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. లక్షలాదిగా తరలి వచ్చి ఈ కవాతును విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ కవాతుకు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి.