కాకినాడ నుంచి జన సాధారణ్‌ రైలు

కాకినాడ నుంచి జన సాధారణ్‌ రైలు

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజల సౌకర్యార్ధం జన సాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ట్రైన్‌ నెంబర్‌ 07190 తిరుపతి - కాకినాడ ఎక్స్‌ ప్రెస్‌ ఈ నెల 12వ తేదీ రాత్రి 9.50  గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.50కి కాకినాడ చేరుకుంటుంది. ట్రైన్‌ నెం. 07191 కాకినాడలో 13న సాయంత్రం 6.45కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.45కి తిరుపతి చేరుతుంది. అయితే ఈ సాధారణ్‌ రైలులో రిజర్వేషన్‌ బోగీలు ఉండవు.