ఐదు పార్లమెంట్‌ స్థానాలకు జనసేన కమిటీలు..

ఐదు పార్లమెంట్‌ స్థానాలకు జనసేన కమిటీలు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు... పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టిన ఆయన... పార్లమెంట్ కమిటీలను ప్రకటిస్తూ వస్తున్నారు. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలో పార్టీ కమిటీలను ప్రకటిస్తున్న జనసేనాని... ఇవాళ తెలంగాణలోని ఐదు పార్లమెంట్ స్థానాలకు కమిటీలను వేశారు. చేవెళ్ల, నిజామాబాద్, మహబూబ్ బాద్, పెద్దపల్లి, జహీరాబాద్ నియోజకవర్గాలకు కమిటీలను ప్రకటించారు పవన్ కల్యాణ్. మరో 5 స్థానాలకు కమిటీలు వేస్తే తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు నియామకాలు పూర్తి కానున్నాయి. ఇవాళ జరిగిన సమావేశంలో అయిదు పార్లమెంటరీ కమిటీలపై చర్చించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు శ్రీ ఎన్.శంకర్ గౌడ్, శ్రీ రామ్ తాళ్ళూరి పాల్గొన్నారు. చేవెళ్ళ, నిజామాబాద్, మహబూబాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్, వర్కింగ్ కమిటీల నేతలు పాల్గొన్నారు.