తొలి రౌండ్‌లో సింధు విజయం

తొలి రౌండ్‌లో సింధు విజయం

జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ ప్లేయర్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 21–17, 7–21, 21–13తో జపాన్‌ క్రీడాకారిణి సయాకా తకహాషిపై విజయం సాధించింది. తొలి సెట్ గెలిచిన సింధు.. రెండవ సెట్ క్లొపోయింది. ఇక మూడవ సెట్ లో దూకుడు ప్రదర్శించి విజయం సొంతం చేసుకుంది.

మరోవైపు జక్కా వైష్ణవి రెడ్డి 10–21, 8–21తో చైనాకు చెందిన ఫాంగ్‌జి గావో చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 21–13, 21–15తో హువాంగ్‌ యుజియాంగ్‌(చైనా)పై, ప్రణయ్‌ 21–18, 21–17తో జొనాథన్‌ క్రిస్టీ(ఇండోనేసియా)పై విజయం సాధించారు.