ప్రేమ కోసం రాచరిక హోదా వదులుకున్న యువరాణి

ప్రేమ కోసం రాచరిక హోదా వదులుకున్న యువరాణి

Image: People.com

కోటలోని యువరాణి వేటాడి మరీ పెళ్లి చేసుకుంది. తన మనసుకు నచ్చిన ఓ కామన్ మ్యాన్ తో సాదాసీదాగా జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్న జపాన్ యువరాణి అయాకో (28).. ఓ సాధారణ ఉద్యోగి అయిన కీ మోరియా (32)ను పెళ్లాడింది. ప్రేమించి పెళ్లాడిన అయాకో.. ఇకపై రాజ గౌరవానికి, సంప్రదాయ మర్యాదలకు శాశ్వతంగా వదులుకుంది. 

రాజకుటుంబ సంప్రదాయం ప్రకారం కిమోనో, హకామా అనే దుస్తుల్లో, రాజకుటుంబాల్లోని మహిళలు అలంకరించుకునే పద్ధతిలో హెయిర్ స్టయిల్ చేసుకొని అయాకో మెరిసిపోయింది. ఇక వరుడు కీ మోరియా జపాన్ లోని షిప్పింగ్ ఫర్మ్ లో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తాడు. తనకు ఈ పెళ్లి ఎంతో ఆనందాన్ని ఇస్తోందని అయాకో చెప్పడం విశేషం.