బుమ్రా బౌలింగ్ దించేస్తున్న బుడ్డోడు

బుమ్రా బౌలింగ్ దించేస్తున్న బుడ్డోడు

ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో తన బౌలింగ్ తో అదరగొట్టేశాడు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. 4 టెస్టుల సిరీస్ లో బుమ్రా 21 వికెట్లు పడగొట్టాడు. ఒకవైపు సొంత మైదానాల్లో వికెట్లు తీసేందుకు కంగారూ బౌలర్లు కష్టాలు పడుతుంటే మనోడు మాత్రం సునాయాసంగా వికెట్లు కూల్చాడు. దీంతో టెస్ట్ సిరీస్ జరిగినంత కాలం ఈ పేసర్ అందరి దృష్టిని ఆకర్షిచాడు. 

దీంతో ఓ ఆస్ట్రేలియా బుడ్డోడు అచ్చంగా బుమ్రా మాదిరిగా బౌల్ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఆ ఐదేళ్ల ఆసీస్ చిన్నోడు బుమ్రాని అనుకరిస్తూ బౌలింగ్ చేయబోయి కింద పడతాడు. బాల్ కూడా పై నుంచి వెళ్లిపోతుంది. కానీ బౌలింగ్ యాక్షన్ మాత్రం బుమ్రాను దించేశాడు. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఈ వీడియో వైరల్ గా మారింది.

బుమ్రా కూడా ఈ వీడియో చూసి ’పిల్లాడు చాలా క్యూట్ గా ఉన్నాడు. ఆ బాబుకి నా అభినందనలు’ అని ట్వీట్ చేశాడు. ఐసీసీ కూడా ఈ వీడియోని షేర్ చేసింది. 2034లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే సిరీస్ ఇలా ఉండబోతోందని కామెంట్ చేసింది. అందుకోసం ఆస్ట్రేలియా తర్వాతి తరం ఇప్పటి నుంచి కసరత్తులు ప్రారంభించిందని సరదాగా వ్యాఖ్యానించింది.